ఇప్పుడు టాలీవుడ్ మొదలుకొని సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే మహేష్ బాబు సజెషన్ చేసిన ఒక డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేశాడన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక అసలు విషయం ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు చేయవలసిన సినిమా ఒకటి ప్రభాస్ దగ్గరికి వెళ్లిందట. ఇక అది కూడా పాన్ ఇండియా నేపథ్యంలో కలిగిన సినిమా. దాంతో ఏమాత్రం ఆలోచించకుండా ప్రభాస్ ఆ సినిమాకి ఓకే చెప్పాడట. అయితే రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఆది పురుష్ సినిమా బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో

 వచ్చిన ఈ సినిమా ఇవాళ విడుదల కావడం జరిగింది. దీంతో ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. త్వరలోనే ప్రభాస్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయడానికి రెడీ ఉన్నాడు. అయితే ఈ సినిమా కథ మొదట మహేష్ బాబుకి వినిపించారట సందీప్ రెడ్డి. అనంతరం ఈ సినిమా మహేష్ బాబుకి సెట్ కాదని తన స్వయంగా ఆయనే చెప్పడట. దాంతోపాటు ప్రభాస్ కి అయితే ఈ సినిమా బాగా సెట్ అవుతుందని ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ మరియు ఇది సబ్జెక్టు కావడంతో ప్రభాస్ మార్కెట్ కి ఈ సినిమా బాగా సెట్ అవుతుందని సందీప్ రెడ్డి తో పాటు

 ప్రభాస్ కి ఫోన్ చేసి ప్రత్యేకంగా స్టోరీ వినాలని మహేష్ బాబు ప్రభాస్ కి చెప్పాడట .అనంతరం ప్రభాస్ మొదటి సిట్టింగ్ లోనే ఈ సినిమాని ఓకే చేశాడట. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాను ముఖ్యంగా బోల్డ్ డైలాగ్స్ మరియు రొమాంటిక్ సీన్స్ అంతేకాదు యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా ఎక్కువగా ఉండడంతో మహేష్ బాబు ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా మహేష్ బాబు చేయాల్సిన స్పిరిట్ ని  ప్రభాస్ చేతికి వెళ్లినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఒక విధంగా చూసుకుంటే మహేష్ బాబు చెప్పడం వల్లే ప్రభాస్సినిమా ఓకే చేశాడు అని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: