ప్రభాస్ రాముడిగా సీతగా కృతి సనన్ నటించిన ఆది పురుష్ సినిమా భారీ అంచనాల నడుమ ఈరోజు విడుదల అయింది. ఇక విడుదలైన కొద్దిసేపటికి పైరసీ బారిన పడింది ఈ సినిమా దురదృష్టవశాత్తు ఈ సంఘటనతో చిత్ర బృందం కలత చెందింది. అయితే తాజా సమాచారం ప్రకారం tamilrockers, filmyzilla, moviesrulz తో సహా అనేక ప్రైవేట్ వెబ్సైట్లో గంటల వ్యవధిలోనే 1080 p నుండి240p వరకు వివిధ రెజల్యూషన్లో స్ట్రీమింగ్ డౌన్లోడ్ కోసం పూర్తి సినిమా అందుబాటులో వచ్చాయి. ఇక ఆది పురుష్ సినిమా లీకై అందరినీ నిరాశపరిచింది. 

ఈ క్రమంలోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అంటున్నారు. హిందీ ఇతిహాసం రామాయణం పై ఆధారపడి దర్శకుడు  విజువల్ ఎఫెక్ట్స్ ల విమర్శల కారణంగా ఇప్పటికే నిర్మాణ సవాళ్లను ఎదుర్కొంది. అనంతరం విఎఫ్ఎక్స్ క్వాలిటీ పెంచి మళ్లీ ఈ సినిమాని తీర్చిదిద్దారు దర్శక నిర్మాతలు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా లీక్ అవడంతో పైరసీ కూడా ఈ సినిమాకి ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టింది. ఇక ఇలా జరగడంతో ఈ సినిమా బిజినెస్ పై ప్రభావం చూపుతోందని అంటున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.

ఇటీవల దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. కాగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 150 కోట్లకు పైనే ఈ డీల్ చేంజ్ కుదించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే భార్య అంచనాల నడుమ ఇవాళ విడుదలైన ఈ సినిమా 50 రోజుల తర్వాత ఓటీటిలో స్ట్రీమింగ్ కానుందని  ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది చిత్రం బృందం. ఈ క్రమంలోనే అందరూ పైరసీ వంటి దుర్మార్గపు చర్యలను తిరస్కరించవలసి ఉంటుంది. అంతేకాదు సినిమాలను థియేటర్లలో మాత్రమే చూడాలి. థియేటర్లలో సినిమాను వీక్షించి ఫిని పరిశ్రమకు మనమంతా మద్దతును ఇవ్వాలి. అంతేకాదు భారతదేశంలో పైరసీ తీవ్రమైన నేరమని చాలామందికి తెలిసే ఉంటుంది. దీన్ని మరోసారి గుర్తు చేసుకోవడం మంచిది అని అంటున్నారు. ఇలా చేసేముందు సినిమా తీయడానికి పడ్డ శ్రమ వీక్షించే సమయం అంకితభావం వారందరి శ్రమను మనం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా ఈ సినిమా అప్పుడే లీక్ అవ్వడంతో అందరూ షాక్ అవుతారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: