ఒకే ఒక్క సీరియల్ తోనే ఈ చిన్నది విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది.  తెలుగులో ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గరయింది అవికా గోర్. ఒకే ఒక్క సీరియల్ తోనే ఈ చిన్నది విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది.  తెలుగులో ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. సీరియల్ వల్ల వచ్చిన పాపులారిటీతో ఈ అమ్మడు తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. సీరియల్స్ లో నటించిన అనుభవంతో చాలా ఈజ్ తో నటించి మెప్పించింది. ఈ సినిమాతోనే యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి రాజ్ తరుణ్ తో కలిసి సినిమా చూపిస్తా మామ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో అవికాకు ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా సినిమాలు చేసినప్పటికీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేక పోయింది ఈ చిన్నది.

ఇక బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాల్లో నటించింది ఈ భామ. కెరీర్ బిగినింగ్ లో పద్దతిగా కనిపించిన ఈ చిన్నది.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం అవికా టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది. ప్రస్తతం బాలీవుడ్ లో 1920 హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌ అనే సినిమా చేస్తోంది అవికా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది ఈ భామ. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  నేపోటిజం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ అటు బీ టౌన్ తో పాటు టాలీవుడ్ లోనూ ఆసక్తిగా మారాయి. బాలీవుడ్ తో పోలిస్తే సౌత్ లో నెపోటిజం కాస్త ఎక్కువగా ఉంటుందని షాక్ ఇచ్చింది అవికా. ఈ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో అవికా పై కొందరు ఫైర్ అవుతున్నారు. అలాగే తాను నటించిన సీరియల్‌ను ఇప్పుడు చూస్తుంటే నవ్వొస్తుంది అని చెప్పుకొచ్చింది. ససురాల్‌ సిమర్‌ కా అనే సీరియల్ లో నటించింది అవికా. ఆ సీరియల్ లో అవికాకు ఏకంగా ఏడు సార్లు పెళ్లి అవుతుంది. అలాగే మూడు సార్లు చనిపోయినట్టు చూపించారు. ఇప్పుడు అవ్వన్నీ చూస్తుంటే నవ్వొస్తోంది అని తెలిపింది అవికా.

మరింత సమాచారం తెలుసుకోండి: