ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో సైతం విజయ్ వర్మ పేరు తెగ వినిపిస్తోంది ఆయన నటించిన దాహద్ డార్లింగ్స్ మీర్జాపూర్ గల్లీ బాయ్ లవ్ స్టోరీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ వర్మ. మిల్కీ బ్యూటీ తమన్నా వల్లే ఆయనకి మరింత గుర్తింపు వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తాజాగా ఈయనని  ఇష్టపడుతున్నట్లు తమన్నా చాలా ఓపెన్ గా చెప్పింది. దీంతో విజయవర్మ మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే విజయవర్మ ఎక్కడ ఉంటాడు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. 

అయితే సినీ ఇండస్ట్రీలో ఆయన స్థిర పడినప్పటినుండి ఇప్పటివరకు ముంబైలో సొంత ఇల్లు ఆయనకి లేదు. ప్రస్తుతం ఆయన సముద్రానికి ఎదురుగా ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. గత పది సంవత్సరాల లో అతను వివిధ కారణాలవల్ల 14 అద్దె ఇళ్లకు రావాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని స్వయంగా అతని ఇంట్లో ఒక మీడియా ప్రతినిధితో పంచుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే విజయ్ వర్మ తన ఇంటి హాల్ లో కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఇక అందులో ఒక ఫోటో చూసి అందరూ షాక్ అవుతారు. ఇక ఆ ఫోటో ఏంటంటే

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరియు విజయ వర్మ కలిసి ఒకే ఫోటో ఫ్రేమ్లో ఉన్నారు. అయితే అది కూడా పెళ్లి బట్టలతో. ఆ ఫోటో ఫ్రేమ్ లో కనిపించారు ఈ ఫోటోని చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. ఏంటి విజయ్ వర్మ కి ఆలియా భట్ తో పెళ్లి జరిగిందా అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఈ ఫోటో డార్లింగ్ సినిమా కోసం ఫోటోషాప్ చేసిన ఫోటో అంట.అందులో అలియా భట్ తన భార్యగా నటించింది. ఇక ఆ సమయంలో మేకర్స్ ఈ ఫోటోని తీయడం జరిగింది. అంతేకాదు ఈ ఫోటోని విజయవర్మ తల్లి చూసి షాక్ అవ్వడమే కాకుండా ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అంటూ విజయ్ ని అడిగిందట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: