టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముందుగుమ్మ ఇతర భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. వివాహమైన తర్వాత కూడా సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ ఈమధ్య లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. ఈ రోజున కాజల్ అగర్వాల్ బర్త్డే సందర్భంగా ఆమెకు సంబంధించి కొన్ని సినిమా అప్డేట్ల సైతం విడుదల చేయడం జరిగింది. కాజల్-60 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు.


ఈ చిత్రం జూన్ 19వ తేదీన కాజల్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ ని గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం. ఈ సినిమాని డైరెక్టర్ అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా టైటిల్ సత్యభామగా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన జరిగింది. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్లు తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ గ్లింప్స్ విషయానికి వస్తే జైలులో ఉన్న నిందితులను చేతితో కొడుతూ నిజం చెప్పించాలని కాజల్ కొడుతున్న సమయంలో ఆమె చేతికి ఉన్న గాజులు పగిలి చేతికి గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటుంది..

రక్తం వస్తున్న చేతితోనే ఏసీబీగా చార్జ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. మహిళా కానిస్టేబుల్ గాజులు తీసేసి కొట్టొచ్చు కదా మేడం అని అడగగా.. పక్కనే ఉన్న ఎస్ఐ ని చూపిస్తూ గాజులు లేకుండా కొట్టాడుగా అంటూ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది..  ఇందులో తనికెళ్ల భరణి, బాబి తిక్క నటిస్తూ ఉన్నారు.. ఈ సినిమాలోనే కాకుండా ఇండియన్-2 , భగవంత్ కేసరి, బాలీవుడ్ లో ఉమా అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం సత్యభామ  సినిమాకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

HBD