సినిమా ఇండస్ట్రీలోకీ రావాలంటే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం కూడా కావాలి అని చెబుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్ల విషయంలో అలాంటి అదృష్టమే కలిసి రాక మంచి గుర్తింపును సంపాదించుకోరు. ఇక అలాంటి వారిలో అటు అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తన రింగు రింగుల జుట్టులో ఉంగరం లాంటి కళ్ళతో అందరిని కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత అనుపమ అఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.


 ఇక దర్శక నిర్మాతల చూపును కూడా తన వైపుకు తిప్పుకుంది. ఇంకేముంది ఆ తర్వాత శతమానం భవతి సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ ఛాన్స్ ఇచ్చింది స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇక శతమానం భవతి సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడి కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక వరుసగా అవకాశాలు దక్కాయ్. అయితే ఎంతో మంది హీరోల సరసన నటించింది. కానీ మంచి గుర్తింపును మాత్రం సంపాదించుకోలేకపోయింది. అయితే మొదటి ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజు అనుపమ కెరియర్ను శాసించే వారట. ఏ సినిమా చేయాలి ఏ సినిమా చేయకూడదు అని డిసైడ్ చేసేవారట.


 ఇక ఇలాగే నాని, సాయి ధరంతేజ్, రామ్ పోతినేని లాంటి హీరోల సినిమాల్లో ఛాన్స్ ఇచ్చి అనుపమను స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేర్చాడు దిల్ రాజు. అలాగే తన తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమైన రౌడీ బాయ్స్ సినిమాలో కూడా అనుపమనే పెట్టుకున్నాడు. అయితే అప్పటి వరకు స్టార్ హీరోలతో లిప్ లాక్ సీన్లో నటించేందుకు ఒప్పుకోని అనుపమ కొత్త హీరో ఆశీష్ రెడ్డితో మాత్రం డీప్ లిప్ లాక్ లు చేసేసింది. దీంతో డబ్బు కోసం అనుపమ ఏమైనా చేస్తుందా అంటూ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్ అయింది. ఇక అనుపమాకు ఉన్న మంచి పేరు కూడా చెడిపోయింది. అప్పటినుంచి ఎక్కువగా అవకాశాలు రావట్లేదు. అందుకే దిల్ రాజు కారణంగానే అనుపమ కెరియర్ నాశనం అయిందంటూ కొంతమంది అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: