నందమూరి నటసింహం బాలకృష్ణ చివరిగా వీరసింహారెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు బాలకృష్ణ. తాజాగా ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకి భగవంత్ కేసరి అనే టైటిల్ని ఫిక్స్ చేశారో చిత్రబంధం .ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ షరవీగంగా జరుగుతుండగా ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. 

కాగా శ్రీ లీల సైతం ఒక కీలక పాత్రలో నటించబోతోంది. భగవంత్ కేసరి సినిమా 2023 దసరాకు విడుదల కానుంది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మరొక కొత్త సినిమాని ప్రకటించడం జరిగింది. డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన రావడం జరిగింది. కాగా ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా స్టార్ హీరోయిన్ నయనతార నటించబోతుంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికి దర్శక నిర్మాతలు నయనతారను ఈ సినిమా కోసం ఒప్పించారన్న టాక్ సైతం నడుస్తోంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహా శ్రీరామరాజ్యం జై సింహా వంటి సినిమాలు ఎంత మంచి విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ కాంబో గనక ఫిక్స్ అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే నాలుగు సినిమా ఇదే. అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో మరొక సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నాలుగవ సినిమాపై భారీ అంచనాలు సైతం నెలకొన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: