టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించారనే సంగతి తెలిసిందే.లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ కెరీర్ మొదలు కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే కమర్షియల్ గా మాత్రం చందమామ సినిమా కాజల్ కు కలిసొచ్చింది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది.ఈ సినిమా కాజల్ అగర్వాల్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందించిందనే సంగతి తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా కాజల్ అగర్వాల్ కు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రావడానికి కారణమైంది. తర్వాత రోజు ల్లో కాజల్ అగర్వాల్ స్టార్ స్టేటస్ ఉన్న ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదనే సంగతి తెలిసిందే.

కాజల్ ఇప్పటి కీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. భగవంత్ సింగ్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఇండియన్2 సినిమా లో సైతం కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి కీ కాజల్ పారితోషికం 2 నుంచి 2.5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ కు ఈ ఏడాది వచ్చే ఏడాది కూడా కలిసిరావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కాజల్ భగవంత్ కేసరి మూవీలో టీచర్ రోల్ లో నటిస్తున్నారని సమాచారం. కాజల్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాజల్ కొత్త ప్రాజెక్ట్ లకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమా లలో నటించడాని కి కాజల్ ఆసక్తి చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: