ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ రంగంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ షో ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపును తెచ్చుకొని ప్రస్తుతం సినిమాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక ఈ షోలో వచ్చే కంటెస్టెంట్ కి ఎంత మేలు చేస్తుందో దానికంటే ఎక్కువ కీడు కూడా చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగులో ఇప్పటికే ఈ షో ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది.తాజాగా ఇప్పుడు ఏడవ సీజన్ సైతం చాలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. దానికి కారణం లాస్ట్ సీజన్ ఫ్లాప్ అవ్వడంతో పాటు హైకోర్టు

 దాకా ఈ విషయం వెళ్లడంతో ఎలాగైనా ఈసారైనా ఈ షోని సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇందులో భాగంగానే ఈ సీజన్లో చాలా వెరైటీ కంటెస్టెంట్లను మరియు బాగా పాపులర్ అయిన సెలబ్రిటీలను ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వివాదాస్పద వ్యక్తులు విడాకులు తీసుకున్న ప్రముఖ జంటను కొత్త జంటలను ఇందులోకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారట  బృందం. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సీజన్లో యాక్టర్ అమర్దీ ఆయన భార్య తేజస్విని, మహేష్ బాబు కాళిదాసు, సిద్ధార్థ వర్మ, యాంకర్స్ దీపిక పిల్లి, రష్మి గౌతమ్, విష్ణు ప్రియ ఉన్నట్లుగా తెలుస్తోంది.

దాంతో పాటు మంగ్లీ ,హేమచంద్ర ,బుల్లెట్ బండి ఫేమ్ మోహన్ భోగరాజు, సాకేత్ వంటి సింగర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు విడిపోయిన సింగర్ నోయల్ ఆయన మాజీ భార్య ఎస్తేర్  బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు యూట్యూబ్ నిఖిల్ విజయేంద్ర సింహ, సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, శోభా శెట్టి, మిత్ర శర్మ సైతం ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు ఈటీవీ ప్రభాకర్ కొరియోగ్రాఫర్ పండు ,జబర్దస్త్ అప్పారావు న్యూస్ లీడర్ ప్రత్యూష డాన్సర్ శ్వేత నాయుడు ట్రాన్స్ జెండర్ మోడల్ సాయి రోనాక్ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ పేర్లు సైతం వినిపిస్తున్నాయి.  అయితే ఈ సీజన్ కి హోస్ట్ గా నాగార్జునకి బదులుగా రానా వస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సీజన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: