తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న నటుడిగా కెరియర్ ను ముందుకు కొనసాగిస్తున్న శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి ఆ తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నటుడు తాజాగా సామజవరగమన అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. 

మూవీ ని జూన్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వరస ప్రమోషన్ లను నిర్వహిస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ను కూడా క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓవర్ సిస్ హక్కులను కూడా ఒక ప్రముఖ సంస్థకు అమ్మి వేసింది. ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను "సరిగమ" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఓవర్ సీస్ లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఈ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు "సామాజవరగమ" సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే జూన్ 28 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. శ్రీ విష్ణు ఆఖరుగా అల్లూరి సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: