ఐరన్ లెగ్ హీరోయిన్ నుండి గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది పూజ హెగ్డే. ఒకప్పుడు టాలీవుడ్  ఇండస్ట్రీలో వరుస స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది ఈమె. అయితే అలాంటి ముద్దుగుమ్మ టాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆమె బాలీవుడ్ కి షిఫ్ట్ అయిందో అప్పటినుండి ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఈమె హీరోయిన్గా నటించిన దువ్వాడ జగన్నాథం అరవింద సమేత అలా వైకుంఠపురంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడంతో 

ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. దాని తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది పూజ హెగ్డే. ఇక బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమె అనుకున్నంత క్రేజ్ ఈమెకి దక్కలేదు. ఇటూ టాలీవుడ్ లో సైతం అవకాశాలు లేవు. బాలీవుడ్లో సైతం అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి అటు ఇటు కాకుండా పోయింది .ప్రస్తుతం తెలుగులో ఆమె మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలోనే ఆ సినిమా నుండి కూడా పూజా హెగ్డే తప్పుకుంది అన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకోవడానికి గల ముఖ్య కారణం

 త్రివిక్రమ్ అని అంటున్నారు. ఇక త్రివిక్రమ్ కావాలని పూజ హెగ్డే పాత్ర తక్కువ చేయడం వల్ల ఆమె కోపంతో ఈ సినిమా నుండి తప్పుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి .అయితే తాజాగా పూజా హెగ్డే టీం ఈ వార్త లపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే పూజ హెగ్డేటింగ్ మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకోవడానికి గల ముఖ్య కారణం గుంటూరు కారం సినిమా షూటింగ్ రోజు రోజుకు ఆలస్యం కావడమే. ఈ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఇతర సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేకపోతోంది. అందుకే గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకుంది అన్న విషయాన్ని వెల్లడించారు పూజ హెగ్డే టీం. ఇక త్రివిక్రమే కావాలని పూజ హెగ్డే ని తీసేసి సంయుక్త మీనన్ ని హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారో అన్న వార్తలు వినపడుతున్నప్పటికీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: