ఇదంతా ఇలా ఉంటే అనిల్ రావిపూడి, బాలయ్య కాంబినేషన్లు ఐదేళ్ల క్రితం సినిమా చేయాల్సి ఉండగా కానీ కొన్ని కారణాల చేత అది కుదరలేదు.. బాలకృష్ణ 100వ సినిమా అనిల్ రావిపూడి చేయాలనుకున్నారట. కానీ అప్పట్లో ఈ సినిమాకి రామారావు అనే టైటిల్ ని కూడా బాలయ్య కోసం ఉంచి ఒక కథను కూడా రాసుకున్నట్లు తెలుస్తోంది.. కానీ లేటెస్ట్ గా బాలయ్య 108వ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుడు రామారావు కథ నే ఇప్పుడు అనిల్ రావు పూడి..భగవంత్ కేసరి గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
రామారావు కథ బాగున్న ఆల్రెడీ ఇదే టైటిల్ తో రవితేజ సినిమా చేయడం జరిగింది.ఆ టైటిల్ తో అయితే పర్ఫెక్ట్ కథ అని అనుకున్న చిత్ర బృందం కానీ బాలయ్య కోసం మరొక కథను రాసుకొని భగవంత్ కేసరి సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమా తో బాలయ్య మార్కుతో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.. ముఖ్యంగా అనిల్ రావు పూడి సినిమాలో కామెడీ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలో బాలయ్య మాస్ లుక్ లో కనిపించబోతున్నారు.. ఇందులో బాలయ్య మాస్ ఆడియన్స్ కు ఫుల్ మిస్ ఇచ్చేలా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.