సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం. అయితే ఈ సినిమా కోసం  అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మహేష్ బాబు పుట్టినరోజు న ప్రారంభమైన ఈ సినిమా పలు కారణాలవల్ల షూటింగ్ ఇప్పటి వరకు ఆలస్యమస్తు వస్తుంది. ఎట్టకేలకు ప్రారంభమైన ఈ సినిమా ఈటీవల మళ్లీ ఆగిపోయిందని తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య కొన్ని ఇష్యూస్ కారణంగా ఈ సినిమా షెడ్యూల్ ఇప్పటివరకు వాయిదా పడుతూ వస్తుంది అన్న పుకార్లు వినిపిస్తున్నాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరియు ఈ సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డేలు సైతం కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకున్నారు.

 అయితే దీనిపై ఇప్పటివరకు చిత్ర బృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఇన్ని పుకార్ల మధ్య ఈ సినిమాకి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది అన్న వార్త వినిపిస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమా షూటింగ్ అప్డేట్ కి సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈరోజు ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానందుని తెలుస్తోంది. హైదరాబాదులోని ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ప్రస్తుతం షూట్ చేస్తున్నారట.

అంతేకాదు నవంబర్ వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ .అంతే కాదు వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ని పూర్తి చేయనున్నారట. ఈ క్రమంలోని పదేళ్ల తర్వాత వీరి ఇద్దరి కాంబినేషన్ కుదరడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దిగవంత సూపర్స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ తెలిసిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: