ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను కూడా విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం భగవత్ కేసరి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని అయితే ఈ పాటకు స్టార్ హీరోయిన్ త్రిష ను కానీ రాధిక ఆప్టేను కానీ సంప్రదించబోతున్నట్లు సమాచారం. ఈ వారంలో ఈ పాటకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరి డేట్ లో బాలయ్య కోసం అడ్జస్ట్ చేసి మరి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో నటిస్తారనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
బాలయ్య ఈ మధ్యకాలంలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు మరొక పక్క రాజకీయాలలో కూడా అంతే చురుకుగా పాల్గొంటున్నారు. బాలయ్య ఇప్పటివరకు దాదాపుగా రాయలసీమ యాసలోని ఎక్కువగా అభిమానులను అలరించారు మొదటిసారి తెలంగాణ యాస తో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని థమన్ సంగీతం అందిస్తూ ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలకు కూడా సంగీతాన్ని అదరగొట్టేసారని థమన్ చెప్పవచ్చు. మరి భగవంత్ కేసరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.