పెళ్లిచూపులు సినిమా తర్వాత తరుణ్ భాస్కర్ తీసిన సినిమా ఈ నగరానికి ఏమైంది..ఈ సినిమా అప్పట్లో పెద్దగా ఫలితాన్ని రాబట్టలేకపోయింది.కానీ ఓటీటిలో శాటిలైట్లో ఈ సినిమా చూసిన యువత మాత్రం బాగా ఆకట్టుకుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమా మీద మిమ్స్ పెద్ద సంఖ్యలో ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి తరుణ్ భాస్కర్ అండ్ ఈ సినిమా అని ఈనెల 29వ తేదీన రి రిలీజ్ చేయాలని భావించారు. పెద్దగా ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా బుకింగ్స్ ఓపెన్ అయినట్టుగా తెలుస్తోంది.
మళ్లీ తమ గ్యాంగ్ తో కలిసి చూడాలనుకుంటున్న యువత ఎక్కువగా ఈ సినిమా కోసం టికెట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలో పలు నగరాలలో ఈ షోలు రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. దీని మీద తరుణ్ భాస్కర్ కూడా ఆసక్తి రేపే విధంగా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఈ గురువారం రెండు కొత్త సినిమాలు మంచి క్రేజీతో విడుదలవుతున్నాయి స్టార్ కాస్ట్ లేని ఒక పాత సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ రావడం తనకు ఆచార్యాన్ని కలిగించింది అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరి ఈ సినిమా కలెక్షన్లలో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి.