తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించడం అన్న విషయం కొత్త ఏమీ కాదు. గతంలో చాలా సినిమాల్లో తండ్రి కూతురు ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనిపించిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. కానీ అలా నటించినప్పుడు ఇద్దరి మధ్య ఏజ్ క్యాప్ చాలా ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తారు. అయితే తాజాగా ఇప్పుడు మరొక స్టార్ హీరో సైతం తన కూతురితో కలిసి నటించబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ హీరో మరెవరో కాదు షారుఖ్ ఖాన్. సుహానా ఖాన్ తో కలిసి షారుఖ్ ఖాన్ ఒక సినిమా చేయబోతున్నారు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

బాలీవుడ్ ఆకలిని తన ఫ్యాన్స్ ఆకలిని తీరస్తు ఇటీవల పఠాన్ సినిమాతో మళ్లీ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు షారుక్ ఖాన్ .వింటేజ్  షారుఖ్ ఖాన్ చూపిస్తూ కోట్లు గడించారు బాక్స్ ఆఫీస్ దగ్గర. అయితే తాజాగా ఇప్పుడు షారుక్ ఖాన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.అట్లీతో చేసే  జవాన్ ఒక సినిమా కాగా రెండవది రాజకుమార్ హీరోనితో చేస్తున్న డంకి సినిమా ఒకటి. ఈ క్రమంలోనే సుహానా సైతం ఈ సినిమాకి యాడ్ అయింది అని తెలుస్తోంది. దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ షారుక్ ఖాన్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందట. ఇక సినిమాలో సుహాన సైతం నటిస్తోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.  

షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మార్ఫ్లెక్స్ పిక్చర్స్  తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సుహానా కోసం ఒక పాత్రని అనుకున్నారట. అయితే ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం స్టార్ట్ అయ్యాయట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందట.అయితే ఇందులో ఈ తండ్రి కూతుర్లు ఇద్దరు ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇక సుహానా ఖాన్ ఒక ప్రధాన పాత్రలో నటించిన తొలి సినిమా ఓటీటి లో విడుదల కానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: