ఆదిపురుష్ సినిమాతో ఇప్పుడు ఎక్కడ విన్నా ప్రభాస్ పేరు వినిపిస్తుంది. ఆది పురుష్ సినిమాపై వివాదాలు మరొకపక్క సలార్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు.. ఇలా ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మార్చేశారు. అయితే ఇలాంటి క్రమంలో ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియా అవుతుంది.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ కి అక్కగా యాంకర్ సుమ నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో యాంకర్ అనే పేరు వినిపించగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు సుమ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతూ యాంకర్ గా కొనసాగుతోంది సుమా. కెరియర్ ప్రారంభంలో సినిమాలు సీరియల్స్ లో నటించి దాని తర్వాత యాంకర్ గా సెటిల్ అయింది.ఇటీవల జయమ్మ పంచాయతీ సినిమాతో కొన్ని ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఇచ్చి ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకుంది. లీడ్ రోల్లో నటించింది గాని ఈ సినిమాతో హిట్టుని మాత్రం అందుకోలేకపోయింది.ఇక అసలు విషయం ఏంటంటే..పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఈశ్వర్ తో హీరోగా కెరియర్ ప్రారంభించాడు. అనంతరం వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నడు.

సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస సినిమాలో చేస్తూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నాడు. అయితే ఈ సినిమాలోని ప్రభాస్ కి అక్కగా సుమా నటించింది. కానీ అదే ఆమె కెరియర్ ప్రారంభంలో కావడంతో అప్పట్లో ఆమెని ఎవరు పెద్దగా గుర్తుపట్టలేదు. అనంతరం రామ బాణం సినిమా ప్రమోషన్స్ టైం లో గోపీచంద్ ఇదే విషయాన్ని ఆట పట్టించడు. బహుశా స్టోరీ చదువుతున్న మీకు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఇక సుమ విషయంకు వస్తే ప్రస్తుతం ఆమె వరుస ఈవెంట్స్ మరియు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చేస్తూ బిజీగా ఉంది.ఏ స్టార్ హీరో సినిమా సినీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా సరే మొదట ప్రిఫరెన్స్ సుమాకి ఇవ్వడం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: