రాఘవ లారెన్స్ నటించిన తాజా సినిమా చంద్రముఖి 2. పి వాసు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని చూడడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు సినీ ప్రేమికులు. అయితే ఈ భారీ సినిమా నుండి ఒక తాజా అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సినీ ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇంతటి టాలెంట్ యాక్టర్ నటిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ క్వీన్ కంగానా రౌనౌత్ హీరోయిన్ గా నటిస్తోంది. పి వాసు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి ఒక

 ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు చెక్కర్లు కొడుతుంది. అయితే రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ సినిమా నుండి ఒక బిగ్ అప్డేట్ రాబోతుంది అంటూ చంద్రముఖి రాజభవనం తలుపును తెరుస్తూ ఒక లుక్ ని విడుదల చేశారు మేకర్స్.అయితే ఈ క్రమంలోని చంద్రముఖి సినిమా నుండి చిత్ర బృందం ఎటువంటి అప్డేట్ ను ఇవ్వబోతున్నారన్న వార్త ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికి కంగనా చంద్రముఖి టు క్లైమాక్స్ సాంగ్ కోసం కళ మాస్టర్ గారి పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్న కొన్ని ఫోటోలు 

సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవికాస్త వైరల్గా మారిన సంగతి తెలిసిందే. చంద్రముఖి సినిమా మొదటి భాగంలో రజనీకాంత్ హీరోగా నటించడం జరిగింది.  రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. కాగా ఇందులో జ్యోతిక పర్ఫామెన్స్ ఈ సినిమాకి చాలా హైలెట్గా నిలిచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలో వచ్చే క్లైమాక్స్ పాట తమిళ్లోనే కాకుండా అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే సీక్వెల్ గా వస్తున్న చంద్రముఖి 2 సినిమా ఎలా ఉండబోతోంది అని తెగే ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలోని క్లైమాక్స్ సాంగ్ లో కంగనా యాక్టింగ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: