నటసిమా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు .ఆయన లైన్ ఆఫ్ చేసిన సినిమాల పండుగ చేసుకుంటున్నారు. ఆయన అభిమానులు ఇటీవల గోపీచంద్ మలినేని దర్శనత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఇప్పుడు బాలకృష్ణ అనిల్ రావిడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .ఇక ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాగా ఈ సినిమాలో శ్రీ లీల సైతం బాలకృష్ణకి కూతురు పాత్రలో నటిస్తోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాతో పాటు బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో సైతం మరొక సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఆ సినిమా కూడా స్టార్ట్ కాబోతోంది. ఇటీవల వాల్తేరు వీరయ్య తో మంచి విజయాన్ని అందుకున్నాడు బాబి .ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ కథను రెడీ చేశారట. అయితే ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది .ఈ నేపథ్యంలోనే బాలయ్యకు ఈ సినిమాలో హీరోయిన్స్ ని కూడా ఫిక్స్ చేశారు అని తెలుస్తోంది.

ఇప్పటికే బాలయ్య తో మూడు సినిమాల్లో నటించిన నయనతారనిఈ సినిమాలో బాలయ్య కి జోడిగా ఎంపిక చేశారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార తో పాటు మరొక హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా తీసుకున్నారని తెలుస్తోంది. కాగా ఇంతకుముందు బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో శ్రీదేవిగా నటించిన రకుల్. అయితే ఇప్పుడే మరొకసారి బాలకృష్ణతో నటించబోతోంది .దీంతో ఒకేసారి ఇద్దరు భామలతో బాలకృష్ణ జతకట్టబోతున్నాడన్న విషయం తెలిసి బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: