కెరటం సినిమా ద్వారా మొదటిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీతిసింగ్ ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వంటి సినిమాతో తెలుగు తెరకు మంచి విజయాన్ని అందుకుంది.ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ దాదాపుగా నాలుగేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అయితే ఈ సక్సెస్ను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది రకుల్ ప్రీతిసింగ్ ఆ తర్వాత వెంటనే బాలీవుడ్ వైపు వెళ్లి ప్రముఖ నిర్మాత నటుడు జాకీభగ్నానితో రకుల్ ప్రీతిసింగ్ ప్రేమలో ఉన్నట్లు తెలియజేసింది.
త్వరలోనే వీరిద్దరి వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. మరొకవైపు రకుల్ ప్రీతిసింగ్ తన బాయ్ ఫ్రెండ్ నిర్మిస్తున్న వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది.గతంలో పోలిస్తే రకుల్ ప్రీతిసింగ్ చాలా బక్క చిక్కిపోయింది. చాలా పలుచగా జీవం లేకుండా కనిపిస్తోందంటూ పలువురు నేటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. కెరియర్ ఆరంభంలో కాస్త బొద్దుగా కనిపించిన రకుల్ ప్రీతిసింగ్ ఎందుకిలా తయారయింది అంటూ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు.
హిందీ పరిశ్రమలో రాణించేందుకు ఇలా జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ ఉందా మరి ఇంతగా తగ్గితే అవకాశాలు వస్తాయా అంటూ పలువురు అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈమె నటించిన ఐ లవ్ యు ప్రమోషన్స్లో సరికొత్త లుక్కులు కనిపించింది. ప్రమోషన్ కోసం బిగ్ బాస్ ott ని సందర్శించిన రకుల్ ప్రీతిసింగ్ ప్రత్యేకమైన ఈవెంట్లో నీలిమ రంగు మినీ దుస్తులలో కనిపించింది. ఇంతలోనే వేరొక మీడియాలో చిట్ చాట్ లో చీరలో మరింత సన్నగా కనిపించి అభిమానులకే విసుకు పుట్టేలా చేస్తోంది రకుల్ ప్రీతిసింగ్.
రకుల్ ప్రీతిసింగ్ పింక్ కలర్ ఊదా రంగు దుస్తులలో డిజైన్ చేసిన చీర బ్లౌజులో చాలా స్మార్ట్ గా కనిపించిన కానీ ఈ ఆమ్మడి అందాలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో రకుల్ ప్రీతిసింగ్ గతంలోనే చాలా అందంగా కనిపించేది అంటూ పలువురు నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: