ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప 2. ఇక ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి భాగం ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక మొదటి భాగం కంటే రెండవ భాగం ఊర మాస్గా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఎవరు ఊహించిన ట్విస్ట్ లు సైతం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సుకుమార్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. 

అంతేకాదులతో పాటు ఈ సినిమాలో అదిరిపోయే ఫైట్ సీన్స్ సైతం ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు ఈ సీన్స్ ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు తెప్పించే విధంగా ఉంటాయట. అంతేకాదు ప్రేక్షకుల అంచనాలను మించే విధంగా పుష్పతో సినిమా ఉండబోతుందని అంటున్నారు. ప్రస్తుతం వైజాగ్ పోర్టులో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం. అంతేకాదు 100 అడుగుల ఎత్తులో అల్లు అర్జున్ ని వేలాడదీసే సీన్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఆ సీన్లు జర్మనీకి చెందిన యాబై మంది ఫైటర్స్ కూడా పాల్గొంటున్నారట.

అంతేకాదు ఈ సీన్ మొత్తం సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఈ ఫైట్ సీన్స్ ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే ఈ ఫైట్ సన్నివేశాలను అల్లు అర్జున్ డూప్ లేకుండా చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే అల్లు అర్జున్ ఈ సినిమాకి దాదాపుగా 80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు ఆయన అభిమానులు. విడుదలకు ముందే ఈ సినిమా సంచలన రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు ఆయన అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: