సినిమా ఇండస్ట్రీ లో కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తే పాతవాళ్లకు అవకాశాలు తగ్గడం సాధారణం గా జరుగుతుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు దాదాపు గా మూడు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలగగా తర్వాత రోజుల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున సత్తా చాటారు.ప్రస్తుతం యంగ్ జనరేషన్ స్టార్ హీరోలైన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ హవా నడుస్తోంది. అయితే ఒకానొక దశలో కృష్ణ పని అయిపోయిందని కామెంట్లు వినిపించగా ఆ సమయంలో కృష్ణకు పూర్వ వైభవం తెచ్చిపెట్టిన సినిమా ఏదనే ప్రశ్నకు నంబర్ వన్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో కృష్ణకు జోడీగా సౌందర్య నటించి మెప్పించారు.

1994 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి సినిమాలలో టాప్ గా నిలిచింది. నెంబర్ వన్ సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందు ముగ్గురు మొనగాళ్లు రిలీజ్ కాగా వారం రోజుల తర్వాత గోవింద గోవింద విడుదలైంది. అయితే ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించే విషయం లో ఫెయిల్ అయ్యాయి. నెంబర్ వన్ సినిమా మాత్రం అంచనాలను మించి కలెక్షన్లను సాధించింది. మహేశ్ ఆనంద్, కోట శ్రీనివాసరావు ఈ సినిమా లో విలన్లుగా నటించారు. బ్రహ్మానందం కామెడీ ఈ సినిమా కు హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా లో కృష్ణ విభిన్నమైన గెటప్స్ లో కనిపించారు. కృష్ణసినిమా లో యంగ్ గా కనిపించారు. ఈ సినిమా ఫలితాన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఒకింత షాకవ్వడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: