నటుడు జగపతిబాబు, మమతా మోహన్, ఆశిష్ గాంధీ విమలా రామన్ ప్రధాన పాత్రల తెరకెక్కించిన చిత్రం రుద్రంగి.. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తూ ఉన్నారు.జులై 7వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నిన్నటి రోజున చాలా ఘనంగా జరిగింది. హైదరాబాదు లో ఈ కార్యక్రమానికి బాలయ్య హాజరు కావడం జరిగింది. ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించారు.

బాలయ్య మాట్లాడుతు ప్రేక్షకులకు కథ మరియు పాత్రలలో లిలమయ్యేలా చేసే అరుదైన సినిమాలలో రుద్రంగి సినిమా కూడా ఒకటని జగపతిబాబు ఎన్నో గొప్ప గొప్ప పాత్రల లో నటించారు.. తన కెరియర్ లో లెజెండ్ రంగస్థలం సినిమాలలో ఆయన నటన అమోఘం ఆయన కోసమే ఆడియన్స్ థియేటర్ కి వచ్చేలా ఆయన నటన అంతగా ఎదిగిందని తెలిపారు. ఇలా ప్రతి క్యారెక్టర్ లో కూడా జీవించి నటించడం అంటే అది మామూలు విషయం కాదు.అలాంటి పాత్రలో జీవించే గొప్ప నటుడు మా జగపతిబాబు అని తెలిపారు.

భారతీయ చిత్ర సీమలోనే ఒక గొప్ప నటుడు మేమంతా ఇప్పుడు మా జీవనం కోసం నటించడం లేదు.. ఆ స్టేజిని మీకు ఎప్పుడు దాటేశాము.. ఇప్పుడంత సినీ ఇండస్ట్రీ బతికించడం కోసమే మేము ఇంకా నటిస్తున్నామని తెలియజేశారు.తన తోటి సీనియర్ హీరోలను అందరిని దృష్టిలో పెట్టుకొని బాలయ్య ఇలా వ్యాఖ్యలు చేసిన.. మమతా మోహన్దాస్ గురించి మాట్లాడుతూ ఆమె ఆన్ స్క్రీన్ లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లోను కూడా వీరవనిత క్యాన్సర్ బారిన పడ్డ ఈమె క్యాన్సర్ అనే భయాన్ని దాటి ఆమె ధైర్యంగా పోరాడి మళ్లీ మన ముందుకు వచ్చింది ఎంతోమంది మహిళలకు మమతా మోహన్దాస్ ఆదర్శమంటూ ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: