బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం అనుకున్నట్టుగానే విడుదల అయ్యుంటే ఈపాటికి ఎప్పుడో విడుదలై నానా హంగామా సృష్టించేది. ఇక ఇప్పుడు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సెప్టెంబర్-7 కోసం.. జవాన్ సినిమా థియేటర్లో వచ్చేది అప్పుడే.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించగా ఇందులో హీరోయిన్గా నయనతార నటిస్తోంది. అయితే తాజాగా జవాన్ సినిమాకు సంబంధించి మ్యూజిక్ రైట్స్ ను భారీ ధరకే ఒక బడా సంస్థ విక్రయించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


జవాన్ సినిమా మ్యూజిక్ రైట్స్ T - సిరిస్ సంస్ధ రూ.35 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా హక్కుల కోసం విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో టి సిరి సంస్థ అత్యధిక ధరకే ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా నటించడంతోపాటు పలువురు అగ్ర నటీనటులు నటిస్తూ ఉండడంతో జవాన్ సినిమా కి ఇంతటి హైప్ ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ఇంకా సౌత్ హక్కుల గురించి సరైన సమాచారం అయితే ఇంకా రాలేదు జూన్ 12వ తేదీన షారుఖ్ ఖాన్ ట్విట్టర్ లో SRK ఆస్క్ సెషన్ లో భాగంగా అభిమానులతో సంభాదించిన కొన్ని విషయాలను షేర్ చేయడం జరిగింది.


జవాన్ సినిమా గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.. ఇక జవాన్ సినిమా గురించి మాట్లాడడమే కాకుండా జవాన్ సినిమాని విడుదల తేదీని కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 7 ఏడాది జవాన్ సినిమా విడుదల కాబోతోందని తెలియజేయడం జరిగింది. 2023 మోస్ట్ అవైడెడ్ చిత్రాలలో జవాన్ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో షారుక్ ఇంటలిజెంట్ ఆఫీసర్గా దొంగగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాకు సంబంధించి టీజర్ ట్రైలర్ ఏవిధంగా ఆకట్టుకుంటాయి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: