కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తాజాగా నటిస్తున్న చిత్రం లియో.. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.. విక్రమ్ సినిమాతో ఇటీవలే సాలిడ్ హిట్ అందుకున్న లోకేష్ కనకరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విజయ్ దళపతి నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త కోలీవుడ్లో తెగ వైరల్ గా మారింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని రిలీజ్ కి ముందే వసూళ్ల పరంగా రికార్డు సృష్టించిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా లియో చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ .400 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. దళపతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే ఇక మరొకసారి నిర్మాతలకు భరోసా ఇస్తూ ఈ సినిమా ఈ రకంగా బిజినెస్ జరగడం నిర్మాతలకు ఆనందాన్ని కలిగిస్తోంది.  ఇకపోతే సాధారణంగా విజయ్ దళపతి సినిమాలు రూ .100 కోట్ల వసూల్ ను అవలీలగా రాబడుతూ ఉంటాయి. తుపాకీ సినిమా నుంచి విజయ్ వరుస విజయాలను అందుకుంటూ జెట్ స్పీడులో దూసుకుపోతున్నారు.

ఇక ఈ సినిమా ఇప్పుడు మరొక బంపర్ హిట్ కొట్టడం ఖాయమని స్పష్టం అవుతుంది. సాటిలైట్ డిజిటల్ అండ్ మ్యూజిక్ రైట్స్ దాదాపుగా రూ.220 కోట్ల వరకు అమ్ముడుపోయాయని రిలీజ్ కి ముందే ఈ సినిమా ఇంకా ఎంత వసూలు చేస్తుందో అన్న ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. మొత్తానికి అయితే ఈ సినిమాతో విజయ్ భార్య విజయాన్ని సొంతం చేసుకునేటట్టు కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను రాబడుతుందో చూడాల్సి ఉంది.  ఇకపోతే ఈ సినిమా గనుక మంచి సక్సెస్ సాధిస్తే హీరోయిన్ గా త్రిష కి కూడా మంచి బ్రేక్ పడుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: