టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏ స్టార్ హీరో చేయనన్ని సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏకంగా నాలుగు ప్రాజెక్టులను ఒకే సమయంలో చేస్తూ ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసే పనిలోపడ్డాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో OG సినిమా కూడా ఒకటి. యాక్షన్ జోనర్లో 1990 నాటి బ్యాగ్రౌండ్ లో ఈ సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ సాహో సేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుజాత పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 

ముంబై నేపథ్యంలో సాగే సినిమా కావడంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టేసారు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న చిత్ర బృందం అదే సమయంలో దీనికి సంబంధించిన 50 శాతం పైగా షూటింగ్ను కంప్లీట్ చేసినట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మిగిలిన షూటింగ్ సైతం వీలైనంత త్వరగా పూర్తిచేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. పవర్ఫుల్ యాక్షన్ తో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రాబోతోంది.అందుకే ఈ సినిమాలో చాలామంది టాలెంటెడ్ నటీనటులు నటిస్తున్నారు. 

ఇప్పటికి చాలామంది పేర్లను చిత్ర బృందం అఫీషియల్ గా బయటపెట్టారు. ఇక అందులో ఒక యాక్షన్ రోల్ కోసం కోలీవుడ్ కి చెందిన ఐశ్వర్య మీనన్ ని సైతం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇందులో ఆమె పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతుంది అని అంటున్నారు.  ఐశ్వర్య మీనన్ తాజాగా నిఖిల్ స్పై సినిమాలో హీరోయిన్గా నటించిన అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: