ఇకపోతే ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో జాంబిరెడ్డి సినిమా వచ్చి మంచి హిట్ అందుకుంది. అందుకే మరొకసారి వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా పక్కా విజయం సాధిస్తుందని అభిమానుల సైతం గట్టిగా నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాను స్టార్ హీరోలతో పోటీపడేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, ప్రభాస్ నటించిన ప్రాజెక్టు K, రవితేజ నటించిన ఈగల్ సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడుతూ ఉండగా.. వీరికి పోటీగా యంగ్ హీరో తేజ తన హనుమాన్ మూవీతో రంగంలోకి దిగబోతున్నారు. మరి ఈ రేస్ లో స్టార్ హీరోలను తట్టుకొని హనుమాన్ ఎలాంటి విజయం సాధిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ గా మారింది. ఏదిఏమైనా ఈసారి సంక్రాంతికి పోటాపోటీగా ఉండబోతోంది అని.. స్టార్ హీరోలను మించి యంగ్ హీరో విజయం సాధిస్తే ఇక ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని సమాచారం.