తెలుగు సినీ ప్రేమికులకు యువ నటుడు శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత ఈ నటుడు సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాల్లో హీరోగా నటించిన శ్రీ విష్ణు అందులో భాగంగా మెంటల్ మదిలో ... బ్రోచేవారెవరురా ... రాజ రాజ చోరా వంటి మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

రాజ రాజ చోరా సినిమా తర్వాత శ్రీ విష్ణు కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఆ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్నాయి. అలా గత కొంత కాలంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వరస అపజయాలను అందుకుంటూ వస్తున్న శ్రీ విష్ణు తాజాగా సామజ వరగమన అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటించాడు. రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... వెన్నెల కిషోర్ ... నరేష్మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 3.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 3.5 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది.

మూవీ 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 3.90 కోట్ల షేర్ ... 7.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టిన ఈ సినిమా ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ తో శ్రీ విష్ణు మరో విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: