వాణిశ్రీ నటి గా తన కెరీర్ ని ముగించిన వాణిశ్రీ కొన్నాళ్ల పాటు అవార్డుల కమిటీ లో మెంబర్ గా ఉన్నారు. అయితే వాణిశ్రీ మొదటి నుంచి చాల నిక్కచ్చి అయినా మనిషి.ఆమె ఒక మాట అన్నారు అంటే అది వెనక్కి తీసుకునే అవకాశం లేదు. అందువల్లే ఆమె నటిగా సక్సెస్ అయ్యారు అని అందరు చెప్పుకుంటారు. ఇక వాణిశ్రీ తాను నమ్మిన సూత్రం ఖచ్చితంగా పాటించే మనిషి. ఎంతలా తన ఆస్థి కాజేసిన సొంత అక్క బావలపై కేసు వేసి నెగ్గి చివరికి వాళ్ళు అవసాన దశలో ఇంట్లో పెట్టుకొని సేవలు చేసింది. ఇక వాణిశ్రీ అవార్డుల కమిటీ లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది.

2004 లో మోహన కృష్ణ ఇంద్రగంటి తొలిసారి దర్శకత్వం వహించాడు. అయితే అవార్డుల కమిటీ కి ఈ చిత్రాన్ని పంపినప్పుడు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం లాంటి చాల అవార్డ్స్ కి నామినేట్ అయినా కూడా కేవలం తొలిసారి దర్శకత్వం వహించిన వారికి ఇచ్చే ఇందిరా గాంధీ అవార్డు మోహన కృష్ణ ఇంద్రగంటి కి ఇచ్చారు. కానీ ఆ విషయంలో మోహన కృష్ణ ఇంద్రగంటి అన్యాయం జరిగింది అంటూ ఈనాడు పత్రిక కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భం లో వాణిశ్రీ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. గ్రహణం సినిమాకు ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డ్స్ కూడా రావాల్సింది కానీ అవార్డ్స్ కోసం కొంత మంది చేసిన లాబీయింగ్ వల్ల ఆ అవార్డ్స్ వేరే సినిమాకు వెళ్లాయని చెప్పారు. వాణిశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో ఇండస్ట్రీ లో పెద్ద దుమారాన్నే లేపాయి. ఆ ఏడాది అవార్డ్స్ అందుకున్న సినిమా లపై మీడియా తో పాటు కొంత మంది నటులు మరియు పెద్దలు కూడా తమ ఆగ్రహాన్ని తెలిపారు. ఏది ఏమైనా మొదటి నుంచి అవార్డ్స్ విషయంలో లాబీయింగ్ మాత్రమే నడుస్తుంది అని అందరికి తెలిసిందే. కానీ అన్ని తెలిసిన ఎవరు ఈ విషయం పై నోరు మెదపడానికి కూడా ఇష్టపడరు. అలాంటి టైం లో వాణిశ్రీ ఎవరికి భయపడకుండా నిజాలను బయట పెట్టడం అనేది మాములు విషయం కాదు. అందుకే చాల మంది స్టార్ హీరోల కన్నా కూడా వాణిశ్రీ బెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి: