బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, స్టార్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ##BoyapatiRAPO కి పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.కార్తికేయ, సుబ్రహ్మణ్య స్వామి  మరొక పేరు అయిన 'స్కంద'ని టైటిల్‌ గా లాక్ చేశారు మూవీ మేకర్స్. ఇక ఎటాకర్ అనే ట్యాగ్ లైన్ హీరో ఫెరోషియస్ స్వభావాన్ని సూచిస్తోంది.అలాగే కార్తికేయస్వామి ఆయుధం శూలం టైటిల్ లోగోలో వుంది.టైటిల్ గ్లింప్ల్స్ లో రామ్ మాస్, రగ్గడ్ అవతార్‌లో సూపర్ గా కనిపిస్తున్నారు. గుడిలోని చెరువులో గూండాల ముఠాపై ఫైట్ చేస్తూ ఎటాకింగ్ మోడ్ లో కనిపించారు రామ్."మీరు దిగితే ఊడేదుండదు. నేను దిగితే మిగిలేదుండదు" అనే పవర్-ప్యాక్డ్ డైలాగ్‌ తో ఆకట్టుకున్నారు పోతినేని రామ్.స్టన్ శివ కొరియోగ్రఫీ చేసిన ఈ హై-ఆక్టేన్ ఫైట్ సీక్వెన్స్‌లో ఎన్నో అద్భుతమైన బ్లాక్స్ ఉన్నాయి. SS థమన్ అద్భుతమైన నేపధ్య సంగీతం విజువల్స్‌ మాస్ ని అయితే నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది. టైటిల్ గ్లింప్స్ అయితే తుఫాను సృష్టిస్తుంది.


వరుస సినిమాలతో మంచి హిట్లు అందుకుంటున్న మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు ఇంకా నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. జీ స్టూడియోస్ , పవన్ కుమార్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఎడిటింగ్‌ వర్క్ తమ్మిరాజు చేస్తున్నారు.'స్కంద' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతుంది.ఇస్మార్ట్ శంకర్ లాంటి బిగ్గెస్ట్ మాస్ బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా పెద్ద మాస్ హిట్ ని అందుకోవడం పక్కా అని అంటున్నారు అభిమానులు. చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: