ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నారో ఇప్పుడు అదే రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది ఆయన గారాల పట్టి సితార.. సాధారణంగా హీరో,  హీరోయిన్లను అభిమానులు ఏ విధంగా అయితే ఆదరిస్తారో వారి కుటుంబాలను కూడా అంతే ఇష్టపడతారని చెప్పాలి. ముఖ్యంగా స్టార్ కిడ్స్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఇవ్వకపోయినా సరే వారిని అభిమానులే పాపులర్ చేస్తూ ఉంటారు.  ముఖ్యంగా స్టార్ కిడ్స్ ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు..అలా మహేష్ బాబు కుమార్తె సితారపై కూడా అందరి ఫోకస్ ఉందని చెప్పాలి.

ఇకపోతే తాజాగా సితార సాధించిన అరుదైన ఘనతను మహేష్ బాబు అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు... అసలు విషయంలోకి వెళితే నమ్రత, మహేష్ బాబుల కూతురు సితార వయసు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే తానే సొంతంగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ యాక్టివ్ గా ఉండే ఈ పాప ఈ మధ్య ఎక్కువగా డాన్స్ వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది,అంతేకాదు యాడ్స్ లో కూడా కనిపించింది. ఇదిలా ఉండగా తాజాగా న్యూయార్క్ లోని టైం స్క్వేర్ వద్ద తన యాడ్ ఫీచర్ అవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

తాజాగా సితార ప్రముఖ పీఎంజే జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇక న్యూయార్క్ లో అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా టైం స్క్వేర్ లో ఈ వాణిజ్య ప్రకటనను ఆవిష్కరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ విషయాన్ని మహేష్ బాబు కూడా పంచుకుంటూ తన కూతురు సాధించిన ఘనతను గర్వంగా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. నా కూతురు టైం స్క్వేర్ ను వెలిగిస్తోంది.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది పటాకా.. నువ్విలాగే వెలిగిపోతూ ఉండు అంటూ మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: