అందులో ముఖ్యంగా షారుఖ్ ఖాన్ , నయనతార జంటగా నటించిన జవాన్ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన విడుదలకు సిద్ధం కాగా మరొకవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సలార్ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సలార్ మూవీ నుంచి పలు విషయాలు బయటకు రాగా సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. జవాన్ చిత్రంపై ఆ స్థాయిలో పంచనాలు నెలకొనలేదు అని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు అందరూ కూడా సలార్ చిత్రంపై తమ ఆశలను పెట్టుకున్నారు. మరొకవైపు అక్టోబర్ 19వ తేదీన లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న లియో చిత్రాన్ని కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్.
మరొకవైపు విజయ్ హీరోగా వస్తున్న లియో చిత్రంపై కూడా అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. ఇలాంటి మూడు పెద్ద స్టార్ హీరోల సినిమాలు అందులోనూ మాస్ జోనర్లో థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రజలు ఏ సినిమాకి పట్టం కడతారు అన్నది ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది . ముగ్గురు స్టార్ డైరెక్టర్లు అందులోను ముగ్గురు స్టార్ హీరోలు పోటీపడుతున్న నేపథ్యంలో ఏ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధిస్తుంది. ఏ సినిమా దసరా హిట్టుగా నిలుస్తుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.