ప్రస్తుతం హీరోయిన్లు కూడా హీరోలతో సమానంగా తమకు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్స్కి తగినట్లుగా నిర్మాతలు కూడా వారికి ఒక్కో సినిమాకి రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్స్ ఇస్తున్నారు.భారీ రెమ్యూనరేషన్స్ కేవలం సినిమాల హీరోయిన్లకే పరిమితం కాలేదు. టీవీ సీరియల్ హీరోయిన్లు కూడా భారీగా పారితోషికం తీసుకుంటూ తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. మరి వారెవరో, ఎంత శాలరీ తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సుహాసిని

బాలాదిత్య హీరోగా వచ్చిన ‘చంటిగాడు (2003)’ మూవీతో సుహాసిని హీరోయిన్గా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ ముద్దుగుమ్మ తన ట్రెడిషనల్, క్యూట్ లుక్స్తో ప్రేక్షకుల మనసు దోచేసింది. కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఆమెకు హీరోయిన్గా అవకాశాలు రాకుండా పోయాయి. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది. ఆపై సీరియళ్లలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బుల్లితెర రంగంలో ఆమెకు చాలానే డిమాండ్ ఉంది. అందుకే సుహాసిని ఒక్క రోజు కాల్ షీట్ కోసం ఏకంగా రూ.20 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అంటే మంత్లీ రూ.6 లక్షలు.

2. ఐశ్వర్య కస్తూరి సీరియల్తో తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న ఐశ్వర్య కూడా సింగిల్ డే కాల్ షీట్కి రూ.20 వేలు ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే నెలకు రూ.6 లక్షలు ఛార్జ్ చేస్తుంది. అదే ఒక సీరియల్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ నడిస్తే ఆమె ఆదాయం కోట్లలోనే ఉంటుందని చెప్పవచ్చు.

3. నవ్య స్వామి

నవ్య స్వామి గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ ఈటీవీ, మాటీవీ, జీటీవీ ఇలా చెప్పుకుంటూ పోతే పాపులర్ ఛానల్లలో పలు సీరియళ్లలో హీరోయిన్గా నటిస్తూ సూపర్ పాపులర్ అయ్యింది. ఈ తార సింగిల్ డే కాల్షీట్ కోసం రూ.35 వేల పుచ్చుకుంటుంది. అంటే మంత్లీ రూ.10 లక్షలకు పైగానే ఆమె ఎర్న్ చేస్తోంది.

4. పల్లవి రామిశెట్టి

సీరియళ్లలో డీసెంట్ రోల్స్ చేస్తూ మంచి స్మాల్స్క్రీన్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న పల్లవి రామిశెట్టి ఒక్క రోజుకి రూ.15 రూపాయిలు తీసుకుంటుంది.

5. ప్రేమి విశ్వనాధ్ ‘కార్తీక దీపం’తో వంటలక్కగా అందరి హృదయాలు దోచేసిన ప్రేమి విశ్వనాధ్ ఒక్క రోజుకి రూ.50 వేల ఛార్జ్ చేస్తుంది. అంటే నెలకు 15 లక్షలకు పై మాటే అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి తెలుగులో ఎవరూ కూడా ఇంత ఎక్కువ పారితోషికం తీసుకోవట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: