జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకొని.. ఆ తర్వాత సినిమాలలో కమెడియన్ గా పనిచేసి ..అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న ప్రముఖ డైరెక్టర్ వేణు ఎల్దండి ఇటీవల బలగం సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ లో కుటుంబ కథా చిత్రంగా బలగం అనే సినిమాను తెరకెక్కించారు.  ఈ సినిమా భారీ గా కలెక్షన్లను వసూలు చేయడమే కాదు ఏకంగా అవార్డుల విషయంలో కూడా సెంచరీ కొట్టేసింది. సాధారణంగా ఒక సినిమా హిట్ అయింది అని అనుకుంటే.. ఒకవేళ అది 100 రోజులు ఆడితే సెంచరీ కొట్టింది అని అంటూ ఉంటారు .

అయితే ఇప్పుడు మాత్రం రూ .100 కోట్ల క్లబ్లో ఆ సినిమా చేరిందా లేదా అని కూడా చూస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు మరో కొత్త ట్రెండు మొదలైంది. ఒక సినిమా రూ.100 కోట్లు రాబడితే చాలు ఆ సినిమా ఎన్ని అవార్డులను సొంతం చేసుకుంది అని కూడా లెక్కించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇకపోతే ఇందుకు కారణం బలగం సినిమా అని చెప్పాలి. ఎందుకంటే తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు వేణు ఎల్దండి చేసిన ఒక పోస్ట్ చాలా వైరల్ గా మారింది. బలగం చిత్రానికి ఏకంగా 100కు పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని ఆయన పోస్ట్ చేయడం గమనార్హం.

ఈ క్రమంలోనే వేణు తన పోస్టులో.. మా ప్రయాణానికి అద్భుతమైన గుర్తింపు లభించింది. గతంలో ఒక సినిమా 100 రోజులు ఆడితే గొప్ప అనుకునే వాళ్ళు.. ఆ తర్వాత 100 సెంటర్లలో సినిమాలు ఆడే రోజులు వచ్చాయి. ఆ తర్వాత రూ .100 కోట్ల వసూలు చేసే సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు మేము 100కు పైగా అంతర్జాతీయ అవార్డులను పొందిన చిత్రంగా మా చిత్రంతో ఘనత అందుకున్నాము.. బలగం సినిమా మాకు ప్రత్యేకమైన సినిమా అంటూ ఆయన పోస్ట్ చేశారు.ఇక ఇందులో కావ్య కళ్యాణ్ రామ్,  ప్రియదర్శి నటీనటులుగా నటించిన విషయం తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: