నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల బింబిసారా అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యాక్షన్ హీరో. ఈ రెండు సినిమాలలో బింబిసార సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ సినిమా. ఇక దాని తర్వాత వచ్చిన ఆమె గో సినిమా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఇప్పుడు డెవిల్ గా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. కెరియర్ బిగినింగ్ నుండి కళ్యాణ్ రామ్ విభిన్న 

కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు డెవిల్ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు కళ్యాణ్ రామ్. 1945 నాటి కథతో ఈ సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమాలో కళ్యాణ్రామ్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే డెవిల్ కి బి బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది క్యాప్షన్ అన్నమాట. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో గతంలో బిబిసారా సినిమా రావడం జరిగింది. తాజాగా కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా

ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ నీ విడుదల చేశారు చిత్ర బృందం. కాగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. కాగా ఈ గ్లిమ్ప్స్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని అంటున్నారు. ఇక తాజాగా విడుదలైన ఈ గ్లింస్ ప్రేక్షకులను ఊహించని స్థాయిలో ఆకట్టుకుంది. నవీన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో 500 మందితో ఉండే యాక్షన్ సీన్ ఈ సినిమాకి హైలెట్ గా ఉండబోతుంది అన్న సమాచారం వినబడుతుంది. కాగా ఈ సినిమాలో సంయుక్త మీనన్ తో పాటు మాళవిక నాయర్ సైతం కనిపించబోతోంది. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: