యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం సలార్.ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని హోంభలే బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడం జరుగుతోంది. తాజాగా కొద్దిసేపటి క్రితమే సలార్ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం. ఈ టీజర్లో ప్రభాస్ మాస్ హీరోగా మరొకసారి మెప్పించబోతున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తూ ఉంటే అభిమానులకే కాకుండా ప్రేక్షకులకు కూడా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉందని చెప్పవచ్చు.



బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా థియేటర్లో కచ్చితంగా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాక్ గ్రౌండ్ కూడా హైలెట్ గా నిలిచేలా కనిపిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తూ ఉండగా హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 14 దేశాలలో ఈ సినిమా టీజర్ ని విడుదల చేయడం జరిగింది మేకర్స్ అయితే టైమింగ్ మాత్రం కొన్ని దేశాలలో ఒకో రకంగా విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు.


సోషల్ మీడియాలో సలార్ అనే హ్యాష్ ట్యాగ్ మాత్రం ట్రెండీగా దూసుకుపోతోంది. ఇక ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్, అది పురుష్ వంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి దీంతో ప్రభాస్ అభిమానులంతా కూడా ఎక్కువగా సలార్ మూవీ పైనే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తారు చూడాలి మరి. సలార్ టీజర్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా ప్రభాస్ ఆభిమానులకు ఫుల్ మీల్స్ దొరికిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: