క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకుంటూ హిట్టు ఫ్లాపాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో యంగ్ హీరో శ్రీ విష్ణు ఒకరు.తాజాగా ఈయన సామజవరగమన అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతుంది.ఇప్పటివరకు ఈ సినిమాపై ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ఈ సినిమాకు రివ్యూ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీవిష్ణు, సీనియర్ నటుడు నరేష్, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ యంగ్ హీరోస్ అందరూ కూడా ఈ సినిమాపై స్పందిస్తూ తమ రివ్యూస్ ఇచ్చారు. తాజాగా అల్లు అర్జున్సినిమా గురించి స్పందిస్తూ... సామజవరగమన చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. ఇది అసలైన తెలుగు ఎంటర్టైన్మెంట్ చిత్రం. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగా ఎంజాయ్ చేశా. దర్శకుడు రామ్ అబ్బరాజు చాలా బాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. శ్రీవిష్ణు రాకింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అతడి పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. వెన్నెల కిషోర్,నరేష్ తమ పాత్రలకు బాగా న్యాయం చేశారని అల్లు అర్జున్ తెలిపారు. ఇక హీరోయిన్ పట్ల అల్లు అర్జున్ ప్రత్యేకంగా ప్రశంశాలు కురిపించారు. నా మలయాళీ అంటూ హీరోయిన్ రెబ్బా మౌనికని బన్నీ ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఈయనకు మలయాళం ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా ఈ సినిమా పట్ల అల్లు అర్జున్ ఇలాంటి రివ్యూ ఇవ్వడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్  సినిమాతో బిజీ కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: