పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ '' సలార్ ''.ఈ రోజు ఇంటర్నెట్ లో ఎక్కడ చూసిన సాలార్ మ్యానియా నే కనిపిస్తుంది.. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సలార్ టీజర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.మాస్ విజువల్స్ అండ్ ఎలివేషన్ తో మరింత పవర్ఫుల్ గా ఉంది. నీల్ టీజర్ కట్ చూసిన తర్వాత ఈ సినిమా 1000 కోట్లు ఖాయం అంటున్నారు. అలాగే ఫ్యాన్స్ కూడా ఈ టీజర్ తర్వాత ఎట్టకేలకు డార్లింగ్ కు మరో బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్స్ ఈ సినిమా తోనే ఉందని సంబర పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పడుతున్నాయి..

ఈ టీజర్ వచ్చిన తర్వాత టాలీవుడ్ విశ్లేషకులు సహా పలు అంతర్జాతీయ కథనాలు కూడా ఈ సినిమా బడ్జెట్ గురించి వరుస కథనాలు చెబుతున్నారు. దీంతో ఈ సినిమా బుడెజ్ట్ అంశం కూడా వైరల్ గా మారింది. ఈ సినిమాను నీల్ 400 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించాడు అనే టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ అయ్యింది.. మరి కెజిఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 లకు కలిసి కూడా నీల్ ఇంత ఖర్చు చేయలేదు.. దీంతో సలార్ కోసం ఈసారి బాగానే ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. మేకర్స్ కూడా నీల్ ను నమ్మి ఆయన చెప్పినంత పెట్టినట్టు అనిపిస్తుంది. కాగా హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ మూవీ గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: