ఉండగా తాజాగా తమిళంలో అవకాశాలు అందుకుంటున్న నేపద్యంలో ఒక తమిళ స్టార్ హీరో కొడుకు నుంచి వేధింపులు ఎదుర్కొంటుంది అని తమిళ్ మీడియాలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే . ఇక ఇది పక్క రాష్ట్రాలకు కూడా పాకడంతో కన్నడ, తెలుగు భాషలలో కూడా కృతి శెట్టి పై ఇలాంటి రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయి. కృతి శెట్టి ఎక్కడికి వెళ్లినా.. ఏ ఫంక్షన్ కి వెళ్లినా..ఆ స్టార్ హీరో కొడుకు ఆమె వెంటే వెళ్తున్నాడు అని ఆమెను ఫోన్ చేసి విసిగిస్తున్నాడు అని.. పైగా కృతి శెట్టి మాత్రం అతడిని పట్టించుకోవడం లేదు అంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా వీటిపై స్పందించిన కృతి శెట్టి ఒక ట్విట్టర్ వేదికగా ట్వీట్ విడుదల చేస్తూ రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చింది..దయచేసి ఇటువంటి అసత్యపు ప్రచారాలను స్ప్రెడ్ చేయకండి అంటూ చేతులు జోడిస్తున్న ఎమోజిని షేర్ చేసి మరి అటు నెటిజెన్స్ ను ఇటు మీడియాని కూడా కోరింది ఈ ముద్దుగుమ్మ. ఇవి పుకార్లే కదా అని వదిలేద్దాం అనుకున్నాను కానీ మితి మీరు తుంటే క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. దయచేసి ఇలాంటి పుకార్లు సృష్టించి ఇతరులను ఇబ్బంది పెట్టకండి అంటూ ఆమె గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మొత్తానికి అయితే ఇన్ని రోజులు కృతి శెట్టి పై వచ్చిన వార్తలు వట్టి పుకార్లే అని తేలిపోయింది.