టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ మెన్  దర్శికుడు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత. ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో ఇప్పటికి విడుదలైన ఈ సిరీస్ కి ఇది రీమేక్ అని అంటున్నారు. కానీ సమంత దాన్ని ఖండించింది తన నటిస్తున్న సిరీస్ రీమే కాదని తన సోషల్ మీడియా వేదికగా ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇందులో  సమంత పాల్గొన్న సన్నివేశాల ఫోటోలు సైతం ఆమె షేర్ చేసింది. సమంత నటించిన ఈ సిరీస్ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. 

ఇక అందులో ఆమెకి జంటగా నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోలను ఇప్పటికే సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత ఆయన నటించిన ఏకైక సినిమా ఖుషి. ఇక ఈ సినిమాలో విజయ్ దేవర కొండ సరసన హీరోయిన్ గా నటిస్తోంది సమంత. అయితే రాజాగా అందుతున్న సమాచారం మేరకు సమంతసినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత దాదాపుగా ఏడాది పాటు సినిమాలకి లాంగ్ బ్రేక్ తీసుకోబోతుంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సమంత. దీంతో ఈ వార్తలు నిజమని తేలిపోయాయి. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంతకి మయోసైటిస్ వ్యాధి మళ్లీ పుంజుకుందని అందుకే సమంత సినిమాలకి సంవత్సరం పాటు లాంగ్ బ్రేక్ తీసుకుందని అంటున్నారు. ఇక ఆ వ్యాధి కారణంగా నిరంతర చికిత్స కోసం సమంతా ప్రస్తుతం అమెరికాలో సర్జరీ చేయించుకోబోతుంది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ సాగాయి. ప్రస్తుతం సమంత సర్జరీ కోసమే ఏడాది పాటు లాంగ్ బ్రేక్ తీసుకోబోతుంది అన్న వార్తలు విన్న సమంతా అభిమానులు షాక్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: