ఈ నెలలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సినిమాలలో ఒకటి బ్రో మూవీ. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యా ణ్ ... సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా నటించారు. ఈ సినిమాలో కెతిక శర్మ ... సాయి తేజ్ సరసన హీరోయిన్ గా నటించగా ... మోస్ట్ టాలెంటెడ్ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి సముద్ర ఖనిమూవీ కి దర్శకత్వం వహించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని జులై 28 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ మరి కొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను కూడా విడుదల చేయబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ మూవీ నుండి మొదటి సింగిల్ అయినటు వంటి "మై డియర్ మార్కండేయ" అనే పాటను జూలై 8 వ తేదీన సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ... సాయి తేజ లు ఉన్నారు.

ఇందులో వీరిద్దరూ కూడా నలుపు రంగు డ్రెస్ లను వేసుకొని అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మొట్ట మొదటి సారి పవన్ ... సాయి తేజ్ లు కలిసి నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: