తెలుగమ్మాయి ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. మొదట్లో హీరోయిన్గా కూడా వాళ్ళ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు సెకండ్ హీరోయిన్ పాత్రలు చేస్తూ కనిపిస్తోంది. అయితే ఆమెకి తెలుగులో హీరోయిన్గా ఛాన్స్ లో రావట్లేదు గాని మలయాళం లో మాత్రమే ఈమెకి హీరోయిన్ గా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి అని అంటున్నారు. అయితే అక్కడ ఈమెకు హీరోయిన్గా మంచి డిమాండ్ ఉంది హీరోయిన్గా చేస్తున్న సరే ఆమె తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే చేస్తుంది.

 అక్కడ హీరోయిన్గా చేస్తున్నప్పటికీ ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం మాత్రం ఆపట్లేదు. అయితే తను తన సోషల్ మీడియాలో సైతం నిత్యం యాక్టివ్గానే ఉంటుంది. అయితే తను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు ఒక రేంజ్ లో వైరల్ అవుతాయి. అయితే గత రెండు మూడు రోజులుగా ఆమె పెడుతున్న ఫోటోలు వాటికి పెడుతున్న క్యాప్షన్స్ ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఆమె మొన్నటి ఫోటోకు ఎదురుచూస్తున్న అని ఆ ఫోటో కింద ఒక క్యాప్షన్ ని జోడించింది ఈషా . ఇక రెండో రోజు ఫోటోలకు నా హృదయం సిగ్గుపడుతుంది

 అంటూ ఆ ఫోటోకి మరొక క్యాప్షన్ ను జోడించి తన సోషల్ మీడియా వేదిక షేర్ చేసింది . పెట్టిన ఫోటోలు మరియు ఆ ఫోటోలకి ఆమె పెట్టిన క్యాప్షన్స్ చూస్తుంటే ఈషా రెబ్బ ఎవరితోనో ప్రేమలో పడింది అంటూ అందరూ ఆ ఫోటోల కింద కామెంట్స్ ని పెడుతున్నారు. అయితే కొంతకాలంగా ఈశారెబ్బా ఒక వ్యక్తితో తిరుగుతున్నట్టు ఇప్పుడు ప్రచారం సైతం జరుగుతోంది. అంతేకాదు అతనితో ప్రేమలో ఉన్నట్లు కూడా చాలా మంది చెబుతున్నారు. ఇక ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్తపై ఈసారి ఈషా స్పందిస్తే కానీ క్లారిటీ రాదు. దీంతో ఈమెకి  సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: