అయితే ఇంతమంది స్టార్స్ ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ ఏ ఇద్దరూ కూడా కలిసి ఒక పూర్తి స్థాయి మల్టిస్టార్రర్ సినిమా చెయ్యలేదు. రీసెంట్ గా చిరంజీవి , రామ్ చరణ్ కలిసి ఆచార్య చిత్రంలో నటించారు కానీ, అందులో రామ్ చరణ్ కేవలం ముఖ్య పాత్రని మాత్రమే పోషించాడు. సినిమా కూడా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. అంతకు ముందు అల్లు అర్జున్ రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం లో పది నిమిషాలు నిడివి ఉన్న ఒక కీలక పాత్రని పోషించాడు. కానీ వీళ్ళ కాంబినేషన్ లో కూడా పూర్తి స్థాయి మల్టీస్టార్ర్ర్ రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ మరియు శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలలో అతిథి పాత్రలను పోషించాడు. వీరి కాంబినేషన్ లో కూడా పూర్తి స్థాయి మల్టీస్టార్ర్ర్ రాలేదు. ఇలా ఏ ఇద్దరూ కూడా మెగా ఫ్యామిలీ లో మల్టీస్టార్ర్ర్ సినిమా చెయ్యలేదు.
అయితే గతం లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఒక మల్టీస్టార్రర్ ఫ్రాంచైజ్ ని ప్లాన్ చేసాడట. ఎఫ్2 మరియు ఎఫ్3 తరహాలో పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించాలని అనుకున్నాడు. ఈ ఫ్రాంచైజ్ కి డైరెక్టర్ గా అనిల్ రావిపూడి ని ఎంచుకున్నాడు. ఎప్పుడో ప్రారంభం అవ్వాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ద్వారా వాయిదా పడుతూ వెళ్ళింది. ఇక ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ని చేద్దాం అనుకున్నారు కానీ, అల్లు అర్జున్ డేట్స్ ఖాళీ లేకపోవడం తో 'వకీల్ సాబ్' చిత్రాన్ని చేసాడు. మరి భవిష్యత్తులో అయినా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ మీదకి వెళ్తుందో లేదో చూడాలి. ఒకవేళ వెళ్తే మాత్రం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.