హీరోయిన్ అంటేనే ఈ కాలంలో అందం గుర్తుకు వస్తుంది. ఎక్స్ పోజింగ్ గుర్తుకు వస్తుంది. హీరోయిన్ల నటన గురించి.. మెచ్చుకునేరోజులు పోయాయి.. అందంగా ఉంటే చాలు.. హీరో పక్కన ఉండి.. కాస్త ఎక్స్ పోజింగ్ చేస్తే చాలు అన్నట్టుగా మారిపోయాయి సినిమాలు. ఈక్రమంలో హీరోయిన్లు కూడా మరింత అందంగా మారడానికి సర్జరీలు చేయించుకుంటున్నారు.కాని ఆ మాయలో పడకుండా నేచురల్ బ్యూటీస్ అనిపించుకునేవారు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. అందులో మొదటి పేరు సాయి పల్లవిదే వస్తుంది. ఎక్స్ పోజింగ్ అంటే పడదు. మేకప్ వేసుకోదు. ఇక సినిమాలో ఏదో ఉన్నాం లే అనేలా ఉండే పాత్రకు మాత్రం ఆమె ఒప్పుకోదు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే.. హీరోయిన్ కు యాక్టింగ్ స్కోప్ ఉంటేనే ఆ సినిమాకు సైన్ చేస్తుంది. అంతే కాని ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే.. డామినేషన్ ఉంటే..పక్కాగా రిజక్ట్ చేస్తుంది.
అలా చేయబట్టే సాయి పల్లవి స్పెషల్ గామారింది. తక్కువ సినిమాలు చేసినా.. స్టార్ డమ్ లో మాత్రం ఏమాత్రం తక్కువ లేదు. అంతే కాదు ఏ సినిమా చేసినా... ఆమ ప్రతిభ కనపడుతుంది. అటువంటి సాయి పల్లవి కూడా ఓసందర్భంలో సర్జరీ చేసుకోక తప్పలేదట. ఇంతకీ సాయి పల్లవి ఏ విషయంలో సర్జరీ చేసుకుందంటే అందాల ముద్దుగుమ్మ లేడి పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి సైతం తన బాడీలోని పార్ట్ కు సర్జరీ చేయించుకుంది అన్న కామెంట్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి .అయితే ఆమె సర్జరీ చేయించుకున్నది మాత్రం అందం కోసం కాదట. ఆమె డాన్స్ చేస్తున్న క్రమంలో సాయి పల్లవి కాలుకి చిన్న గాయమైందని ..ఆ టైంలోనే ఆమె సర్జరీ చేయించుకోవలసి వచ్చిందని సమాచారం.అయితే ఇప్పటికీ.. సాయి పల్లవి డాన్స్ చేసేప్పుడు ఆ కాలు నొప్పి వస్తుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్త సాయి పల్లవి ఫ్రెండ్ వల్ల బయటకు వచ్చిందట. దీంతో రకరకాల వార్తలు వండి వార్చుతున్నా సోషల్ మీడియాలో. కొంత మంది నెగెటీవు న్యూస్ వైరల్ చేస్తుంటే.. మరికొంత మంది మాత్రం అసలు విషయం తెలుసుకుని ఆ వార్తను హైలెగ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా సినిమాలు చేసుకుంటుంది సాయి పల్లవి. పెద్దగా హంగు ఆర్బాటం లేకుండా.. నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తోంది. ప్రస్తుతం శివ కార్తికేయ సినిమాతో ఓ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం కాశ్మీర్లో ఈ సినిమా షూట్ లో బిజీబిజీగా ఉంది.