మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవిసినిమా నుండి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.  ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని ఆగస్టు 11న విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసే పనిలో ఉన్నారు మేకర్స్. 

అయితే ఈ సినిమాలోని జామ్ జామ్ జజ్జనక తెల్లార్లు ఆడదాం తైతక్క అంటూ సాగే రెండవ పాటని ఈనెల 11న విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆదివారం ఈ పాటకి సంబంధించిన ప్రోమోను సైతం విడుదల చేశారు మేకర్స్. అయితే ఇందులో చిరంజీవి చాలా సాంప్రదాయ దుస్తులను వేసుకొని తనదైన శైలిలో హుషారైన డాన్స్ తో తెగ ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ పాటలు మరియు పోస్టర్లు మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. అయితే చిరంజీవి అభిమానులు చిరంజీవి నుండి ఏదైతే కోరుకుంటారో

 అటువంటి అన్ని అంశాలతో ఈ సినిమాని తీస్తున్నామని ఇప్పటికీ చెప్పుకొచ్చారు చిత్రం బృందం. కాగా ఈ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లు గాని నటిస్తున్నారు. ఇక ఇందులో తమన్నా మెగాస్టార్ చిరంజీవి కి జోడిగా నటిస్తుండగా కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలి పాత్రలు కనిపించబోతుందని అంటున్నారు. కాగా వీరిద్దరితోపాటు ఇందులో సుశాంత్ రఘుబాబు మురళి శర్మ రవిశంకర్ వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి సినిమాకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: