టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ లైగర్ సినిమా తర్వాత చాలా డీలా పడిపోయాడు అని చెప్పాలి. ఒకరకంగా ఆయన లైగర్ సినిమా తర్వాత అసలు ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అన్న విషయం కూడా ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. అయితే గత కొంతకాలం క్రితం పూరి జగన్నాథ్ తన సోదరుడు పెట్ల గణేష్ ఇంట పూజా కార్యక్రమాల్లో కనిపించారు. అంతేకాదు అప్పుడే సినిమా కూడా అనౌన్స్ చేస్తాడు అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. 

కాగా వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ రాబోతున్న ఈ సినిమా ఎప్పటినుండి స్టార్ట్ అవుతుంది అన్న అంశంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కానీ కొద్ది రోజుల క్రితం జూలై 9వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా 12వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ సైతం ప్రారంభం కానుందన్న వార్తలు వచ్చాయి. అయితే ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం జరిగిందా లేదా అన్న విషయాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. ఈ క్రమంలోని చిత్ర బృందం నుండి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి సంబంధించిన

 ఒక అప్డేట్ రేపు ప్రకటిస్తామని పూరి కనెక్ట్స్ సంస్థ ప్రకటించడం జరిగింది. ఇక అప్డేట్ ఏంటి అన్న విషయంపై క్లారిటీ అయితే ఇప్పటివరకు రాలేదు. అయితే ఈ సినిమాల్లో నటించబోయే హీరోయిన్లు ఇతర టెక్నీషియన్ల గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే రామ్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించబోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్గా కనిపించబోతుందని సమాచారం. అయితే ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా ఇంటర్నేషనల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ త్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుందట. కాగా పూరి కనెక్ట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుండగా చార్మి మరియు పూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: