టాలీవుడ్ లో అందం దానికంటే ఎక్కువ అందమైన గాత్రం ఉన్న సింగర్లలో సింగర్ సునీత కూడా ఒకరు. ఎన్నో అద్భుతమైన పాటలను పాడి అలరించారు సునిత. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్గా యాంకర్ గా సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది సునీత. తన మధురమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకుంది ఈమె. దాంతోపాటు తన సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తోంది. అయితే రకరకాల పోస్టులతో ఆకట్టుకుంటూ ఉంటుంది సునీత. 

అయితే తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో వైరల్ అవుతుంది. అయితే తన ఇన్స్టగ్రామ్ స్టోరీస్ లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది సునిత. అయితే సింగర్ సునీత కి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అన్న విషయాన్ని తెలిపింది సునీత. అయితే స్టార్ యాంకర్ సుమ తో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ సుమ అంటూ ఆమెతో కలిసిన ఒక ఫోటోను షేర్ చేసుకొచ్చింది సునీత. గతంలో సుమా కనకాల తన బెస్ట్ ఫ్రెండ్ అని చాలా సందర్భాల్లో సునిత చెప్పిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది.

 అయితే తాజాగా సునీత తన బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫోటోని షేర్ చేయడంతో అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇదిలా ఇలా ఉంటే ఇక సింగర్ సునీత కొడుకు ఇప్పుడు హీరోగా ఇంట్రీ ఇచ్చాడు. సర్కారు నౌకరి అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు సింగల్ సునీత కొడుకు. గంగన మోని శేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. దాంతోపాటు ఈ సినిమాలో భావన అనే ఒక కొత్త హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే సింగర్ సునీత ప్రస్తుతం పలు షోల్లో జడ్జ్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. దాంతోపాటు పాటలు పాడుతూ కెరియర్ పరంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సింగర్ సునీత..!!

మరింత సమాచారం తెలుసుకోండి: