పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ లో సైతం ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూలై 9వ తేదీన ఎదిరించు ఎన్నుకో జైహింద్ అనే బయోతో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను స్టార్ట్ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే అలా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను ఓపెన్ చేశారో లేదో ఫాలోవర్లు ఒక రేంజ్ లో పోటెత్తారు.పవన్ దెబ్బకు ఇన్స్టాగ్రామ్ మొత్తం షేక్ అయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫాలోవెర్ల విషయంలో రికార్డులు బద్దలు కొట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు పవన్ అనుసరిస్తున్న వారి సంఖ్య 2.3 మిలియన్లకు బద్దలు కొట్టింది. 

అయితే అది కూడా ఒక్క పోస్ట్ కూడా లేకుండానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో 2.3 మిలియన్ల ఆయన అభిమానులు చేరుకున్నారు. అయితే మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ లో మొదటగా ఏం పోస్ట్ చేస్తారు అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన ఫాలోవర్స్. అయితే ఒకవేళ మొదటి పోస్ట్ పెడితే గనుక పవన్ కళ్యాణ్ కి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగే అవకాశం ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతుండడం మనం చూడొచ్చు. అయితే ఇందులో స్టార్ హీరోయిన్లు కూడా ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో అయిన శృతిహాసన్ కీర్తి సురేష్ వంటి చాలామంది స్టార్ హీరోలో హీరోయిన్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇక అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న బ్రో సినిమా జులై 28న గ్రాండ్గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా మేలన్లుడు సాయంత్రం నటిస్తున్నాడు. ఇప్పటికీ ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ టీజర్ లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాది భగత్ సింగ్ ఓ జి హరి హర వీరమల్లు వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: