గతంలో తన కొడుకు సంజయ్ రావుని పెట్టి ఓ పిట్ట కథ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తాజాగా మరో సినిమాతో బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు మన ముందుకు రాబోతున్నారు.అదే స్లమ్ డాగ్ హస్బెండ్.ఈ సినిమాలో సంజయ్ రావు సరసన ప్రణవి మానుకొండ హీరోయిన్ గా చేస్తుంది. వెరైటీ కాన్సెప్టును ఎంచుకున్న డైరెక్టర్ ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించారని ఇప్పటికే విడుదలైన పోస్టర్,టీజర్ ని చూస్తే అర్థమవుతుంది.
ఇక ఈ సినిమా 21న విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాజాగా బ్రహ్మాజీ ఓ ప్రెస్ మీట్ లో పాల్గొని కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు. బ్రహ్మజీ ఏ షోలో పాల్గొన్న ఇంటర్వ్యూలో పాల్గొన్న కచ్చితంగా అక్కడ నవ్వులు పూయాల్సిందే. అయితే తాజాగా పాల్గొన్న ప్రెస్ మీట్ లో కూడా బ్రహ్మాజీ మాట్లాడిన మాటలు చూసి చాలామంది నవ్వుకుంటున్నారు. ఆ ప్రెస్ మీట్ లో బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ప్రతిసారి సురేష్ కొండేటి ఏదో ఒక కాంట్రవర్సీ ప్రశ్న అడుగుతాడు.
అయితే ఇప్పుడు ఆయన అడగముందే నేనే చెబుతున్నాను ఆ ప్రశ్న ఏంటంటే..కుక్కతో పెళ్లి చేశారు కదా మరి ఫస్ట్ నైట్ కూడా చేశారా అని అడుగుతారు అని బ్రహ్మాజీ అన్నాడు. దానికి సురేష్ కొండేటి స్పందిస్తూ..ప్రశ్న అడిగావు మరి దానికి ఆన్సర్ చెప్పవా అని అడిగేసరికి కుక్కతో ఫస్ట్ నైట్ చాలా బాగుంది కావల్సుంటే మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి అంటూ బ్రహ్మాజీ అనడంతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా నవ్వారు.