ప్రభాస్ అభిమానులు షారుక్ ఖాన్ అభిమానులు సెప్టెంబర్ నెల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలలో ఈ ఇద్దరి హీరోల చిత్రాలు విడుదల కాబోతుండడం జరుగుతుంది ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు రకాల అప్డేట్ల సైతం విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా భారతీయ సినీ చరిత్రలోనే సెప్టెంబర్ నెల ఒక భయంకరమైన నెలగా పోలుస్తూ కొంతమంది సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి ఇద్దరి హీరోల మధ్య వార్ తప్పదా అనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.


ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సలార్.. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉండగా విలన్ గా మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. సలార్ చిత్రం సెప్టెంబర్ 18వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి టీజర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.


ఇక షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమా నిన్నటి రోజున ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్లో కూడా షారుక్ ఖాన్ అద్భుతమైన నటన ప్రదర్శించినట్టుగా కనిపిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించగ.. నయనతార హీరోయిన్గా.. దీపికా పదుకొనే కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తూ ఉన్నారు. జవాన్ సలార్ సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఈ రెండు చిత్రాలు కూడా దాదాపుగా రూ .1000 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసే సామర్థ్యం ఉందని సినీ విశ్లేషకులు సైతం  తెలియజేస్తున్నారు. దీన్ని పట్టి చూస్తే వీరిద్దరి మధ్య వార్ తప్పదు అనే విధంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: